logo

ఎన్నికల ఆహ్వాన పత్రిక

సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. ఆ రోజున జరిగే ఓటింగ్‌లో అందరూ పాల్గొనాలని తెలుపుతూ ఆంగ్లంలో ముద్రించిన ఆహ్వాన పత్రిక ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Published : 09 May 2024 04:49 IST

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఎన్నికల ఆహ్వాన పత్రిక

కలికిరి, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. ఆ రోజున జరిగే ఓటింగ్‌లో అందరూ పాల్గొనాలని తెలుపుతూ ఆంగ్లంలో ముద్రించిన ఆహ్వాన పత్రిక ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మన ఇళ్లలో ఏదైనా శుభ కార్యక్రమం నిర్వహిస్తుంటే బంధువులు, స్నేహితులను పిలవడానికి ఆహ్వాన పత్రిక ఎలా ముద్రిస్తామో అచ్చం అలాగే ఇదీ ఉంది. ఆహ్వాన పత్రికలో మాత్రం ప్రజాస్వామ్య పండగగా రాయడంతో పాటు వేదిక పోలింగ్‌ స్టేషను, సమయం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, విందు అయిదేళ్లకొకసారి వచ్చే ప్రజాస్వామ్య పండగగా దీన్ని వర్ణించారు. దీనికి వచ్చే సమయంలో ఏదైనా గుర్తింపు కార్డు తీసుకు రావాలని సూచించారు. చివరగా ఇది ప్రజల సన్నద్ధత, అవగాహన నిమిత్తమని పేర్కొనడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని