logo

‘విజయవాడ జిల్లాకు రంగా పేరు పెట్టాలి’

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్నట్లు నోటిఫికేషన్‌ జారీ చేసిన విజయవాడ జిల్లాకు మాజీ ఎమ్మెల్యే, దివంగత వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని ఆల్‌ ఇండియా కాపు ఫెడరేషన్‌ నగర అధ్యక్షుడు ఆల తారక రామారావు

Published : 28 Jan 2022 02:08 IST

మాట్లాడుతున్న ఆల తారక రామారావు. చిత్రంలో శ్రీనివాస్‌, రవి

అజిత్‌సింగ్‌నగర్‌, న్యూస్‌టుడే :  రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్నట్లు నోటిఫికేషన్‌ జారీ చేసిన విజయవాడ జిల్లాకు మాజీ ఎమ్మెల్యే, దివంగత వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని ఆల్‌ ఇండియా కాపు ఫెడరేషన్‌ నగర అధ్యక్షుడు ఆల తారక రామారావు డిమాండ్‌ చేశారు. కాపు నాయకులు చలమలశెట్టి శ్రీనివాసరావు, బాసంశెట్టి రవిలతో కలిసి నందమూరినగర్‌లోని ఫెడరేషన్‌ నగర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువైన విజయవాడ నగరంలో వంగవీటి మోహనరంగా స్థానం సుస్థిరమన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, కార్మికుల సమస్యలపై రంగా చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. విజయవాడతో పాటుగా చుట్టుపక్కల అనేక ప్రాంతాల అభివృద్ధికి ఎమ్మెల్యేగా రంగా అవిరళ కృషి చేశారని, రాజకీయాలకతీతంగా అనేక మంది ఉద్దండుల అభిమానాన్ని చూరగొన్న నాయకుడిగా రంగా పేరుగాంచారని పేర్కొన్నారు. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టడానికి తాము వ్యతిరేకం కాదని, నిమ్మకూరు ప్రాంతంలో పుట్టిన ఎన్టీఆర్‌ పేరును మచిలీపట్నం ప్రాంత జిల్లాకు పెడితే సముచితంగా ఉంటుందని వివరించారు. విజయవాడ జిల్లాకు వీఎం రంగా పేరును, గుంటూరు జిల్లాకు కన్నెగంటి హనుమంతు పేరును పెట్టాలని ఆల్‌ ఇండియా కాపు ఫెడరేషన్‌గా పోరాటం చేస్తామన్నారు. కాపుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరారు. ఈ సమావేశంలో నాయకులు నున్నా సుదాకర్‌, బొమ్మసాని హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని