logo
Published : 03/12/2021 02:47 IST

సమాఖ్య స్ఫూర్తిని పరిరక్షించుకోవాలి

సమావేశంలో కోదండరాం, రాములు, సాంబశివరావు, లక్ష్మణ్‌, బాబురావు, సాధినేని వెంకటేశ్వర్‌రావు (ఎడమ నుంచి కుడికి)

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: ఫెడరల్‌ స్ఫూర్తిని పరిరక్షించుకోవాలని తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నారు. గురువారం సుందరయ్య కళానిలయంలో నిర్బంధ వ్యతిరేక వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నేతలపై ఎన్‌ఐఏ దాడులను అరికట్టి, అక్రమ కేసులు, ఊపా చట్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాజ్యాంగ నిబంధనలకు ఎన్‌ఐఏ గాలికొదిలి, ఇష్టారాజ్యంగా అక్రమ కేసులను బనాయించడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటాలు సాగించాలన్నారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.గడ్డం లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. స్థానిక ఠాణాలో సమాచారం లేకుండా ఎన్‌ఐఏ దాడులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ప్రొ.హరగోపాల్‌ మాట్లాడుతూ.. భాజపా సర్కారు ప్రశ్నించే గొంతులను తీవ్రంగా అణచివేస్తోందన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.రాములు, హెచ్‌ఆర్‌ఎఫ్‌నేత బాబురావు, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్‌రావు, పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ వి.సంధ్య, రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ, వీక్షణం సంపాదకుడు ఎన్‌.వేణుగోపాల్‌, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు, టీపీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర, ఐఏపీఎల్‌ నేతలు వెంకన్న, సురేశ్‌, ఇతర ప్రజా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని