icon icon icon
icon icon icon

30 ఏళ్లుగా ఎమ్మెల్యే కావాలని..

ఒక్కసారైన ఎమ్మెల్యే గా గెలవాలని రాజకీయ నేతలు ఆరాటపడుతుంటారు. అందుకోసం ఎన్నేళ్లయినా పోరాడుతుంటారు. పార్టీలు మారుతుంటారు.

Published : 04 Nov 2023 08:36 IST

న్యూస్‌టుడే, ఆమనగల్లు: ఒక్కసారైన ఎమ్మెల్యే గా గెలవాలని రాజకీయ నేతలు ఆరాటపడుతుంటారు. అందుకోసం ఎన్నేళ్లయినా పోరాడుతుంటారు. పార్టీలు మారుతుంటారు. కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లుకు చెందిన భాజపా నేత తల్లోజు ఆచారి ఎమ్మెల్యే కావాలని ఒకే పార్టీలో ఉంటూ 30 ఏళ్లుగా పరితపిస్తున్నారు. ఇప్పటి వరకు  ఐదుసార్లు పోటీచేశారు. 1984లో భాజపాలో చేరిన ఆయన 1994లో ఆ పార్టీ తరఫున కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు. అనంతరం 1995లో ఆమనగల్లు సర్పంచిగా విజయం సాధించారు. 2004, 2009, 2014, 2018లో ఎమ్మెల్యేగా పోటీచేసి పరాజయం చెందారు. 2014లో కేవలం 78 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఆరోసారి బరిలో నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img