icon icon icon
icon icon icon

JP Nadda: కాంగ్రెస్‌పై భాజపా వివాదాస్పద పోస్టు.. జేపీ నడ్డాకు సమన్లు

కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ చేసిన వివాదాస్పద పోస్టుపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)కు సమన్లు అందాయి. 

Published : 08 May 2024 19:13 IST

బెంగళూరు: కాంగ్రెస్‌ను విమర్శిస్తూ చేసిన ఒక సోషల్ మీడియా పోస్టుపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda), ఐటీ సెల్‌ చీఫ్ అమిత్ మాలవీయకు కర్ణాటక పోలీసులు సమన్లు ఇచ్చారు. అలాగే బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్‌స్టేషన్‌లో వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ సమన్లలో భాగంగా వారు హాజరయ్యేందుకు అధికారులు వారం రోజుల సమయం ఇచ్చారు.

ముస్లిం ఓటుబ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బడుగువర్గాల రిజర్వేషన్లు గుంజుకునేలా రాజ్యాంగాన్ని మార్చాలన్నది కాంగ్రెస్, దాని మిత్రపక్షాల విధానమని ప్రధాని మోదీ సహా భాజపా నేతలు విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే.   ఆ మాటలు ప్రతిబింబించేలా ఒక వీడియోను భాజపా కర్ణాటక యూనిట్ ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది. ఆ వీడియోను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆ పోస్టును వెంటనే తొలగించాలని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశాలు ఇచ్చారు. దానిని తొలగించాలంటూ మంగళవారం ఎక్స్‌కు నోటీసులు కూడా ఇచ్చారు. 

ఇదిలాఉంటే.. కొద్దిరోజుల క్రితం మోదీ మాట్లాడుతూ..‘‘‘కర్ణాటకలో కాంగ్రెస్‌ అనేకమంది ముస్లింలను అక్రమంగా ఓబీసీ జాబితాలో చేర్చింది. దేశ వనరులు తొలుత ముస్లింలకే చెందుతాయని కాంగ్రెస్‌ ప్రకటిస్తుంటే.. వాటిపై పేద ప్రజలకే మొదటి హక్కు ఉందని నేను చెబుతున్నా. మతపరంగా ఎటువంటి వివక్ష లేకుండా 80 కోట్ల మందికి భాజపా ప్రభుత్వం ఉచితంగా రేషన్‌ అందించింది. ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటూ.. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్‌ ఆటలు ఆడుతోంది. వాళ్లు అధికారంలోకి వస్తే ‘వారసత్వ పన్ను’ పేరుతో ప్రజల నుంచి సగానికి పైగా ఆస్తిని దోచుకుంటుంది’’ అని విమర్శించిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img