icon icon icon
icon icon icon

Nara Brahmani: ఓటేసే ముందు ఆలోచించండి: నారా బ్రాహ్మణి

 స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి అన్నారు.

Updated : 29 Apr 2024 21:59 IST

తాడేపల్లి: స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి తెలిపారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లిలో స్త్రీ శక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని మహిళలకు 2610 కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. లోకేశ్‌ ఎమ్మెల్యే అయితే, మరిన్ని కార్యక్రమాలు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. రాష్ట్ర పునర్‌వైభవం ఎవరి వల్ల సాధ్యమవుతుందో ఓటు వేయడానికి ముందు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img