Adilabad: పితృమాసం భోజనాలు తిని.. 70 మందికి అస్వస్థత

ఇంద్రవెల్లి మండలం మెండపల్లిలో కలుషిత ఆహారం తిని దాదాపు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన ముండే బలవంత్‌.. పితృమాసం సందర్భంగా తన ఇంట్లో శుక్రవారం రాత్రి స్థానికులకు భోజనాలు ఏర్పాటు చేశారు.

Updated : 07 Oct 2023 12:06 IST

ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి మండలం మెండపల్లిలో కలుషిత ఆహారం తిని దాదాపు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన ముండే బలవంత్‌.. పితృమాసం సందర్భంగా తన ఇంట్లో శుక్రవారం రాత్రి స్థానికులకు భోజనాలు ఏర్పాటు చేశారు. భోజనాలు తిన్న కొందరు అర్ధరాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. శనివారం ఉదయం సైతం మరికొందరు ఇలాగే ఇబ్బంది పడటంతో 108కు సమాచారం అందించారు. 20 మందిని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు, మరికొందరిని మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి ఐదు అంబులెన్స్‌ల్లో తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి గ్రామంలో శిబిరం ఏర్పాటు చేసి వైద్యుడు డాక్టర్‌ శ్రీకాంత్‌ సేవలందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని