‘అమరావతిపై తాడోపేడో తేల్చాలని కోరతాం’

ఏపీ రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేదనడం సరికాదని అమరావతి ఐకాస ఛైర్మన్‌ జీవీఆర్‌ శాస్త్రి అన్నారు.

Updated : 23 Feb 2024 18:55 IST

రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేదనడం సరికాదు: జీవీఆర్‌ శాస్త్రి

దిల్లీ: ఏపీ రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేదనడం సరికాదని అమరావతి ఐకాస ఛైర్మన్‌ జీవీఆర్‌ శాస్త్రి అన్నారు. రాజధాని అంశాన్ని విభజన చట్టంలో చేర్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అమరావతి రైతుల ఆందోళన 250 రోజులకు చేరిన సందర్భంగా దిల్లీలో శాస్త్రి మీడియాతో మాట్లాడారు. త్యాగాలు చేసిన రాజధాని ప్రాంత రైతులకు మనోవేదన మిగుల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

వర్షాకాల సమావేశాల్లో ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసి ఈ అంశాన్ని వివరిస్తామని శాస్త్రి చెప్పారు. ఎంపీలందరికీ ఈ విషయాన్ని తెలియజేసి ఈ సమావేశాల్లో తాడోపేడో తేల్చాలని కోరతామన్నారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చినందునే గతంలో అమరావతిపై కోర్టుల్లో ఒక్క కేసు కూడా లేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం లేదని.. అన్ని జిల్లాలకు అభివృద్ధి చెందే స్థాయిలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని