చిన్నారి ‘సెల్యూట్‌’కు సలాం కొట్టాల్సిందే

భారత సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే సైన్యం అంటే దేశ ప్రజలందరికీ ఎనలేని గౌరవం.

Updated : 13 Oct 2020 09:55 IST


దిల్లీ: భారత సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే సైన్యం అంటే దేశ ప్రజలందరికీ ఎనలేని గౌరవం. ఇక, సరిహద్దు ప్రాంత వాసులకు వారెప్పుడు సుపరిచితులే. అయితే, ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీసులు(ఐటీబీపీ) కనిపించగానే ఓ చిన్నారి హుషారుతో సెల్యూట్ చేసిన తీరు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఐటీబీపీ ట్విటర్‌లో షేర్ చేసిన వీడియోలో తనకు దగ్గరగా పెట్రోలింగ్ సిబ్బంది వస్తుంటే ఆ బాలుడు వారికి సెల్యూట్ చేస్తూ కనిపించాడు.

‘సెల్యూట్‌! నమ్‌గ్యాల్, లద్దాఖ్ దగ్గర్లోని చుషుల్‌కు చెందిన ఈ చిన్నారి ఐటీబీపీ దళాలు ఆ దారిలో వెళ్తుండగా సెల్యూట్ చేస్తూ కనిపించాడు. చాలా హుషారుగా  కనిపించిన ఆ బాలుడిని  ఐటీబీపీ అధికారి ఒకరు తన వీడియోలో బంధించారు’ అంటూ ఐటీబీపీ ట్వీట్ చేసింది. అలాగే సావధాన్‌, విశ్రమ్ అనే పదాలకు తగ్గట్టుగా ఆ బాలుడు తన పాదాలను కదపడం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని చూసిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ ఆ చిన్నారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అతడి వివరాలు పంపించమని సదరు అధికారులను కోరారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని