
విజయవాడ @ 4; విశాఖ @ 9
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల వెల్లడి
నాలుగోసారి ఇండోర్‌దే ప్రథమ స్థానం
దిల్లీ: పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన ‘స్వచ్ఛ సర్వేక్షణ్-2020’ అవార్డులను కేంద్రం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 4242 పట్టణాలు, 62 కంటోన్మెంట్ బోర్డుల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే చేపట్టి ఫలితాలను కేంద్ర పట్టణ, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరీ గురువారం విడుదల చేశారు. 10లక్షలకు పైబడిన నగరాల జాబితాలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం వరుసగా నాలుగోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో ర్యాంకును సూరత్, మూడో ర్యాంకు నవీ ముంబయి దక్కించుకోగా నాలుగో స్థానంలో విజయవాడ నిలిచింది. విశాఖ 9వ ర్యాంకు సాధించగా.. హైదరాబాద్ 23 స్థానంలో నిలిచింది.
అలాగే, లక్ష నుంచి 10లక్షలు జనాభా కలిగిన పట్టణాల జాబితాలో ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ తొలి స్థానంలో నిలవగా.. మైసూర్ రెండో స్థానంలో, న్యూదిల్లీ (ఎన్‌డీఎంసీ) మూడో స్థానంలో నిలిచాయి. ఈ కేటగిరీలో తిరుపతి 6వ ర్యాంకు సాధించగా.. రాజమహేంద్రవరం 51; ఒంగోలు 57; కాకినాడ 58; కరీంనగర్ 72; తెనాలి 75; కడప 76;చిత్తూరు 81; తాడిపత్రి 99వ ర్యాంకుల్లో నిలిచాయి. స్వచ్ఛతపై ప్రపంచంలోనే అతి పెద్ద సర్వే ఇదేనని అధికారులు తెలిపారు. మొత్తం 4242 నగరాల్లో 28 రోజుల పాటు సర్వే చేపట్టారు. సర్వేలో భాగంగా క్షేత్రస్థాయి నుంచి 24లక్షలకు పైగా ఫొటోలను జియోట్యాగ్ చేశారు. అంతేకాకుడా 1.9కోట్ల మంది పౌరుల నుంచి ఫీడ్ బ్యాక్‌ను సేకరించారు. ఇది పూర్తిగా డిజిటల్ సర్వే.
ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో ఆయా నగరాలు/ పట్టణాల ర్యాంకులు ఇవే..
Advertisement