ఆ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాలి:కేటీఆర్‌

పరిశ్రమల ఏర్పాటుకు భూములు తీసుకుని కార్యకలాపాలు ప్రారంభించని సంస్థలపై చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

Published : 26 Aug 2020 01:32 IST

హైదరాబాద్‌: పరిశ్రమల ఏర్పాటుకు భూములు తీసుకుని కార్యకలాపాలు ప్రారంభించని సంస్థలపై చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో పెట్టుబడులు తెస్తున్నామని.. సంస్థలు సైతం ఇచ్చిన హామీ మేరకు కార్యకలాపాలు ప్రారంభించాలన్నారు. నిర్ణీత గడువులోపు కార్యకలాపాలు ప్రారంభించని వారందరికీ షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో ఉన్న అన్ని పరిశ్రమలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఒకేచోట చేర్చి బ్లూ బుక్‌ తయారు చేయాలని అధికారులకు సూచించారు. పరిశ్రమల సమగ్ర వివరాలు, కంపెనీల ప్రాథమిక సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే ఇతర కార్యక్రమాలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ను మంత్రి ప్రారంభించి దాని కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు.ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని