రష్యా వ్యాక్సిన్‌కు 20దేశాల ఆర్డర్లు!

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు బ్రహ్మాస్త్రమైన వ్యాక్సిన్‌ కోసం జనమంతా కోటి ఆశతో ఎదురుచూస్తున్న......

Updated : 12 Aug 2020 07:31 IST

మాస్కో: ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు బ్రహ్మాస్త్రమైన వ్యాక్సిన్‌ కోసం జనమంతా కోటి ఆశలతో ఎదురుచూస్తున్న వేళ రష్యా తొలి టీకాను ప్రకటించిన విషయం తెలిసిందే. తన కుమార్తె సహా పలువురు టీకా వేయించుకున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ వెల్లడించారు. ఈ వ్యాక్సిన్‌కు స్పుత్నిక్-వి‌ అని నామకరణం చేశారు. రష్యా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ కోసం పలు దేశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు బిలియన్‌ డోస్‌ల వ్యాక్సిన్‌ కోసం 20 దేశాలు ముందస్తుగా ఆర్డర్‌ చేశాయని ఈ వ్యాక్సిన్‌కు నిధులు సమకూరుస్తున్న రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సంస్థ అధిపతి కిరిల్‌ దిమిత్రియేవ్‌ తెలిపారు.

ఈ వ్యాక్సిన్‌ మూడో దశ ట్రయల్స్‌ బుధవారం నుంచి ప్రారంభమవుతాయన్నారు. అలాగే, పరిశ్రమల్లో వ్యాక్సిన్‌ ఉత్పత్తిని మాత్రం సెప్టెంబర్‌ నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. ది గమలేయా రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేస్తున్న స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌పై విదేశాలు ఆసక్తి చూపుతున్నట్టు గుర్తించామని తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ పొందేందుకు ఇప్పటికే 20 దేశాల నుంచి దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. విదేశీ భాగస్వాములతో కలిసి రష్యా ఏడాదికి 500 మిలియన్‌ డోసుల వ్యాక్సిన్‌ను ఐదు దేశాల్లో ఉత్పత్తి చేస్తుందని ఆయన తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని