Fat Transfer: కొవ్వుతో కొత్త అందాలు.. ఎలాగో తెలుసా..!

కొవ్వును వ్యర్ధ పదార్థంగానే భావిస్తాం..కొన్ని వ్యాధులకు కారణమని నిందిస్తాం. అదే కొవ్వు ఇపుడు అందాలను మెరుగులు దిద్దుకోవడానికి అక్కరకు వస్తోంది. ఎక్కడయితే అధికంగా కొవ్వు ఉంటుందో దాన్ని సేకరించి అవసరమైన చోట అమర్చడానికి సాంకేతిక పరిజ్హానం అందుబాటులోకి వచ్చింది. దీన్నే ఫ్యాట్‌ ఆటో ట్రాన్స్‌ఫర్‌గా పిలుస్తున్నారు.

Published : 16 Jul 2022 01:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవ్వును వ్యర్థ పదార్థంగానే భావిస్తాం.. కొన్ని వ్యాధులకు కారణమని నిందిస్తాం. అదే కొవ్వు ఇప్పుడు అందాల మెరుగులు దిద్దుకోవడానికి అక్కరకు వస్తోంది. ఎక్కడయితే అధికంగా కొవ్వు ఉంటుందో దాన్ని సేకరించి అవసరమైన చోట అమర్చడానికి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీన్నే ఫ్యాట్‌ ఆటో ట్రాన్స్‌ఫర్‌గా పిలుస్తున్నారు. ఇది ఎలా చేస్తారో, ఎవరికి చేస్తారో ప్రముఖ ప్లాస్టిక్‌ సర్జన్‌ వై.వి.రావ్‌ వివరించారు. అవసరానికి మించి ఉన్నప్పుడే.. కొవ్వు అనగానే అందరూ భయపడుతారు. గుండె, కిడ్నీ, కాలేయంతో పాటు అధిక రక్తపోటు, మధుమేహం, హార్మోన్ల అసమతుల్యం వస్తుందని ఆందోళన చెందుతారు. కానీ కొవ్వు తప్పనిసరి అవసరం. అది లేకపోతే బతకలేం. అవసరానికి మించి ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి.  ప్రయోజనాలు తెలుసుకోండి.. శరీరంలోని కొన్ని భాగాలైనా చెంపలు, రొమ్ములు, పిరుదులు, తొడలు లాంటి భాగాలు ఎబ్బెట్టుగా ఉంటే.. కొవ్వును బదిలీ చేసి సరి చేసే పద్ధతి అందుబాటులోకి వచ్చింది. ఒకటి నుంచి మూడు, నాలుగు సిట్టింగ్‌లలో అనుకున్నంత అందాన్ని పొందే అవకాశం ఉంది. చెంపలకు ఒక సిట్టింగ్‌ సరిపోవచ్చు. రొమ్ములకు రెండు, మూడు సిట్టింగ్‌లతో ఆకృతిని సమకూర్చడానికి వీలుంది. పుట్టకతో సమస్య ఉన్నవారికి, ప్రమాదాలకు గురైనవారికి ఈ ప్రయత్నం బాగా ఉపకరిస్తుంది. ఎలాంటి కోతలు లేకుండా ఇంజెక్షన్లతోనే చికిత్స చేస్తారు.  చికిత్స తర్వాత ఏం చేయాలంటే.. ఫ్యాట్‌ ట్రాన్స్‌ఫర్‌ తర్వాత ఆ ప్రాంతంలో ఐస్‌ప్యాక్‌ పెడితే సరిపోతుంది. ఎక్కువగా మసాజ్‌ చేయొద్దు. ముందుగా మొహం కాస్త ఉబ్బినట్టు ఉంటుంది. వారం పది రోజుల్లో ఇది సర్దుకుంటుంది. ఎలాంటి ఇబ్బందులుండవు. అనుకున్న అందం సొంతం అవుతుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని