ఎత్తిపోతల పథకానికి ఏపీ అనుమతులు

పోలవరం ప్రాజెక్టులోని హెడ్ రెగ్యులేటర్ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మాణానికి పాలనా అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 19 Apr 2021 23:53 IST

అమరావతి: పోలవరం ప్రాజెక్టులోని హెడ్ రెగ్యులేటర్ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మాణానికి పాలనా అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.912 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేసవిలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు తాగునీటి సరఫరా కోసం ఈ పథకాన్ని వినియోగించనున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ నెలల మధ్య కాలంలో ఆయా జిల్లాల్లోని ప్రాంతాలకు నీటిని సరఫరా చేసేందుకు  కుడి కాలువలో నీటిని ఎత్తిపోసేలా ఈ పథకాన్ని నిర్మించనున్నారు. పోలవరం రిజర్వాయర్‌లో 35 మీటర్ల నుంచి 32  మీటర్ల కాంటూరు వరకు నీటిని ఎత్తిపోసేలా ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని జలవనరుల శాఖ నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని