Amaravati Padayatra: పోలీసుల ఆంక్షల మధ్యే పాదయాత్ర.. గుడివాడలో భారీ బందోబస్తు

పోలీసుల ఆంక్షల మధ్య అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర చేస్తున్న

Updated : 24 Sep 2022 16:43 IST

కృష్ణా: పోలీసుల ఆంక్షల మధ్యే అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర చేస్తున్న రాజధాని రైతులకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండడంతో ఇతర ప్రాంతాల నేతలను రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రానికి రైతుల పాదయాత్ర గుడివాడ చేరుకోబోతోంది. ఈ నేపథ్యంలో గుడివాడ పట్టణంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా దాదాపు 300మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని కీలక ప్రాంతంలో పోలీసులు కవాతు నిర్వహించారు. పాదయాత్రకు సంఘీభావంగా అడుగడుగునా స్థానిక రైతులు, ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. రైతులపై పూలు చల్లి, హారతులు ఇచ్చి స్థానికులు స్వాగతం పలుకుతున్నారు.

ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తాం: ఎస్పీ జాషువా

గుడివాడ పట్టణంలో పోలీసుల ఆంక్షలు ఉన్నాయని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. ‘‘600 మందితో యాత్ర చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. రైతులను కూడా హైకోర్టు ఆదేశాలను పాటించాలని కోరుతున్నాం. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పోలీసు ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తాం’’ అని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని