Ukraine Crisis: విద్యార్థులు తప్ప ప్రవాసాంధ్రులు మమ్మల్ని సంప్రదించలేదు: కృష్ణబాబు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 423మంది ఏపీ విద్యార్థులను మ్యాపింగ్‌ చేశామని రాష్ట్ర రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు.

Updated : 26 Feb 2022 14:34 IST

అమరావతి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 423మంది ఏపీ విద్యార్థులను మ్యాపింగ్‌ చేశామని రాష్ట్ర రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. మ్యాపింగ్ చేసిన వాళ్లతో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి సూచనలిస్తున్నామన్నారు. 23 మంది విద్యార్థులు వస్తున్నారని కేంద్రం సమాచారం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. కాగా ఏపీకి చెందిన ముగ్గురే ఉన్నట్లు తమ పరిశీలనలో తెలిందని కృష్ణబాబు వివరించారు. ఉక్రెయిన్‌ నుంచి ఏపీ విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కృష్ణబాబు నేతృత్వంలో నిన్న టాస్క్‌ఫోర్స్‌ కమిటీని నియమించింది. ఈ సందర్భంగా ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు.

‘‘దిల్లీలో ఎయిర్‌పోర్టులో ఏపీ భవన్‌ తరఫున హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశాం. సరిహద్దు ప్రాంతాలకు వెళ్లొద్దని భారతీయులకు సూచనలు వచ్చాయి. సరిహద్దులకు వెళ్లొద్దని విద్యార్థులకు సూచిస్తున్నాం. ఉక్రెయిన్‌లోని ఏడు వర్సిటీల్లో ఏపీ విద్యార్థులు చదువుతున్నారు. వర్సిటీల సమీపంలోని రొమేనియన్‌ ఎంబసీని సంప్రదిస్తున్నాం. విద్యార్థులు తప్ప ఉక్రెయిన్‌లోని ప్రవాసాంధ్రులు మమ్మల్ని సంప్రదించలేదు. ఎంతమంది ఆంధ్రులు ఉక్రెయిన్‌లో ఉన్నారనే వివరాలు రాబడుతున్నాం. వీసా స్టాంపింగ్‌, ఐబీ, విదేశీ విద్యలకు పంపే ఏజెన్సీల ద్వారా సమాచారం సేకరిస్తున్నాం’’ అని కృష్ణబాబు అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని