CM Jagan: స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక అందించాలి: సీఎం జగన్‌

స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక అందించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. తగినన్ని తరగతి గదులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.

Updated : 14 Apr 2022 07:07 IST

అమరావతి: స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక అందించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. తగినన్ని తరగతి గదులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. దశలవారీగా ఆరు కేటగిరీల స్కూళ్లు ఏర్పాటు కావాలన్న సీఎం... స్కూళ్లవారీగా సబ్జెక్టులకు అనుగుణంగా టీచర్లను పెట్టాలని సూచించారు. విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం.. నాడు-నేడు రెండోదశ వేగం పెంచాలని ఆదేశించారు. శరవేగంగా పనులు పూర్తి చేసి రెండో విడత పూర్తి చేయాలన్నారు. రెండో దశ కింద దాదాపు 25వేల స్కూళ్లలో పనులు చేపట్టామని, వీటి ద్వారా పాఠశాలల్లో గణనీయమైన మార్పులు కనిపించాలని తెలిపారు.

ఈ విద్యాసంవత్సరంలో 8వ తరగతి ఆంగ్ల మాధ్యమంలోకి  మార్చాలన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లోనూ నాడు-నేడు కింద పనులు చేపట్టాలని సూచించారు. నాడు-నేడు రెండో దశ ఖర్చు అంచనా రూ.11,267 కోట్లుగా నిర్ణయించినట్టు సీఎం తెలిపారు. నాడు-నేడు కింద 468 జూనియర్‌ కళాశాలల్లో పనులు చేపట్టినట్టు తెలిపారు. దీంతో పాటు ప్రతి మండలానికి రెండు జూనియర్‌ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి సీఎస్‌ సమీర్‌శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్‌, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్‌, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేశ్‌కుమార్‌, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని