Margadarsi: మార్గదర్శి బ్రాంచీల్లో రెండో రోజూ ఏపీ సీఐడీ తనిఖీలు

మార్గదర్శిపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు కొనసాగుతోంది. ఏపీ వ్యాప్తంగా మార్గదర్శి బ్రాంచీల్లో వరుసగా రెండో రోజూ సీఐడీ తనిఖీలు నిర్వహిస్తోంది. సీఐడీ అధికారులతో పాటు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌, విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు.

Updated : 18 Aug 2023 12:56 IST

అమరావతి: మార్గదర్శిపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి బ్రాంచీల్లో వరుసగా రెండో రోజూ సీఐడీ తనిఖీలు నిర్వహిస్తోంది. సీఐడీ అధికారులతో పాటు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌, విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. కొన్ని బ్రాంచీల్లో అధికారులు షట్టర్లు మూసి కస్టమర్లను వెనక్కి పంపుతున్నారు. కొన్నిచోట్ల చిట్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టేందుకు వచ్చినవారిని వెనక్కి పంపారు. మార్గదర్శి బ్రాంచీల్లో విధులకు వచ్చిన సిబ్బంది మొబైల్‌ ఫోన్లను అధికారులు తీసుకున్నారు. 

Margadarsi: కోర్టు ఆదేశాలు బేఖాతరు.. మార్గదర్శిపై మళ్లీ దాడులు

మార్గదర్శిపై ఎలాంటి తీవ్రమైన చర్యలూ తీసుకోవద్దని.. చందాదారులను ఇబ్బందులకు గురిచేయవద్దని ఉన్నత న్యాయస్థానాలు పలుమార్లు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికారులు సోదాలు జరుపుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని