Andhra News: వాణిజ్య పన్నుల విభాగంలో నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు

వాణిజ్య పన్నుల విభాగంలోని నలుగురు ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. మీడియా కథనాలు, వ్యక్తిగత ఫిర్యాదులపై విచారణ కమిటీ నివేదిక మేరకు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Published : 24 Jan 2023 11:20 IST

అమరావతి: వాణిజ్య పన్నుల విభాగంలోని నలుగురు ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. మీడియా కథనాలు, వ్యక్తిగత ఫిర్యాదులపై విచారణ కమిటీ నివేదిక మేరకు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కమిటీ నివేదిక ఆధారంగా ఏసీటీవోలు ప్రసాద్‌, మెహర్‌ కుమార్‌, సంధ్య, గడ్డం ప్రసాద్‌ను సస్పెండ్‌ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగ వర్గాల్లో నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్‌ కలకలం రేపుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని