TTD: నేరచరిత్ర ఉన్న సభ్యులు పాలకవర్గంలో ఉండకూడదు: ఏపీ హైకోర్టు

నేర చరిత్ర గలవారికి తితిదే బోర్డు సభ్యుడి పదవి ఇవ్వడంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated : 31 Mar 2022 17:04 IST

అమరావతి: నేర చరిత్ర గలవారికి తితిదే బోర్డు సభ్యుడి పదవి ఇవ్వడంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తితిదే బోర్డు సభ్యులుగా నేరచరిత్ర ఉన్న వారిని నియమించారంటూ భాజపా నేత భానుప్రకాష్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేసు వివరాలను సీజే ధర్మాసనానికి ఇవాళ పిటిషనర్‌ తరఫు న్యాయవాది అందజేశారు. నేరచరిత్ర ఉన్నవారిని తితిదే బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారన్న న్యాయస్థానం... మీకేదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించింది.  పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నట్లు భావిస్తున్నామన్న ధర్మాసనం.. అందరినీ తొలగించకపోయినా కొందరినైనా తొలగించాలని సూచించింది. ‘‘తితిదే భవనం కలెక్టరేట్‌కు ఇవ్వడం విధానపరమైన నిర్ణయం కావడంతో సమర్థించాం. నేరచరిత్ర ఉన్న సభ్యులు పాలకవర్గంలో ఉండకూడదు. ఏప్రిల్‌ 19న కేసు వాదనలు వింటాం... అదే రోజు నిర్ణయం. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఏప్రిల్‌ 19వ తేదీకి కేసు విచారణ వాయిదా వేస్తున్నాం’’ అని ధర్మాసనం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని