Heavy Bleeding: నెలసరిలో ఎక్కువగా రక్తం పోతుందా? ఇలా ఎందుకు జరుగుతుందంటే!

మహిళలకు నెలనెలా సక్రమంగా సాగిపోవాల్సిన రుతుక్రమం కొంతమందికి చాలా ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. నెలసరిలో రక్తం ఎక్కువగా పోవడంతో చాలా మంది రక్తహీనతతో సతమతమవుతుంటారు.

Published : 29 Sep 2022 01:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహిళలకు నెలనెలా సక్రమంగా సాగిపోవాల్సిన రుతుక్రమం కొంతమందికి చాలా ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. నెలసరిలో రక్తం ఎక్కువగా పోవడంతో చాలా మంది రక్తహీనతతో సతమతమవుతుంటారు. కొత్త చిక్కులతో ఆందోళన చెందుతారు. అసలు అధిక రుతుస్రావం ఎందుకు అవుతుంది? దానికి గల కారణాలేంటో ఆయుర్వేద ఫిజిషియన్‌ డాక్టర్‌ గాయత్రిదేవి వివరించారు.

ఎందుకు వస్తుందంటే...!

నెలసరిలో రక్తం అధికంగా పోవడం మంచిది కాదు. ఎప్పుడో ఓసారి కాకుండా ప్రతి నెలా ఇలాగే ఉంటే మాత్రం కారణం తెలుసుకోవాల్సిందే. నెలసరిలో 20-60 ఎంఎల్‌ దాకా రక్తస్రావం కావాలి. కానీ కొంతమందిలో అంతకంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఐదు రోజులయినా కొంతమందికి ఎక్కువగా రక్తస్రావం కనిపించడంతో ఏ పని సరిగా చేసుకోలేరు. ఇక ఉద్యోగులకైతే మరీ కష్టంగా ఉంటుంది. ఎక్కువగా హార్మోన్లలో తేడాలు, ఫైబ్రాయిడ్స్‌ ఉండటంతో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. 

ఏం చేయాలంటే...!

పిరియడ్స్‌ సమయంలో కారం, మసాలాలు తగ్గించుకోవాలి. తీపి ఆహార పదార్థాలు, చేదుగా ఉండే కాకర లాంటి కూరగాయలు తీసుకోవాలి. యోగాసనాలు చేయడం కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ప్రాణాయామం కూడా చేయాలి. మహిళలు కాస్త ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. నెయ్యి, కందిపప్పు, పాత బియ్యం, నిమ్మ, దానిమ్మ, ఉసిరి, పాలపదార్థాలు, ఖర్జూరం లాంటి వాటిని ఎక్కువగా తీసుకోవడంతో స్రావం ఎక్కువ కాకుండా నివారిస్తాయి. నెలసరి సమయంలో ప్రతి రోజు చెంచా పసుపులో ఒక చుక్క నీటిని వేసి ఉండచేసి మింగాలి. ధనియాల కషాయం మూడు పూటలా తాగితే ఫలితం ఉంటుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని