Vande bharat express: భువనేశ్వర్‌-విశాఖ వందే భారత్‌ టికెట్‌ ధరలు ఇవే..!

BBS to VSKP Vande bharat express train fare: భువనేశ్వర్‌- విశాఖ వందే భారత్‌ రైలు టికెట్‌ ధరలు ఖరారయ్యాయి. సోమవారం మినహా మిగిలిన అన్ని రోజులూ ఈ రైలు అందుబాటులో ఉంటుంది.

Published : 14 Mar 2024 15:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తూర్పు కోస్తా రైల్వే పరిధిలో భువనేశ్వర్‌- విశాఖ (Bhubaneswar-visakhapatnam) మధ్య వందే భారత్‌ రైలు అందుబాటులోకి వచ్చింది. ఈనెల 12న ప్రధాని మోదీ ఈ రైలును వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. తాజాగా ఈ రైలు టికెట్‌ ధరలు వెల్లడయ్యాయి. ఈనెల 17 నుంచి ప్రయాణానికి ఐఆర్‌సీటీసీలో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. సోమవారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు ఈ రైలు అందుబాటులో ఉంటుంది.

ప్రతి రోజూ ఉదయం 5.15 గంటలకు భువనేశ్వర్‌లో (రైలు నం.20841) నంబర్‌తో బయలుదేరి.. 11 గంటలకు విశాఖ చేరుకొంటుంది. మధ్యలో ఖుర్ధారోడ్‌ (5.33), బలుగావ్‌ (6.23) బ్రహ్మపుర (7.05), ఇచ్ఛాపురం (7.18), పలాస (8.18), శ్రీకాకుళం రోడ్‌ (9.00), విజయనగరం స్టేషన్లలో (9.43) ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో (20842) మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరి 9.30 గంటలకు భువనేశ్వర్‌ చేరుకుంటుంది. ఈ రైలుకు 8 బోగీలు ఉంటాయి. 443 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు 5.45 గంటల సమయం పడుతుంది. 

ఈ పోస్టాఫీసు పథకంతో నెలకు ₹9 వేలు ఆదాయం

టికెట్‌ ధరలు ఇవే..

అన్ని వందే భారత్‌ రైళ్లలానే ఇందులోనూ ఏసీ చైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్ ఉంటాయి. భువనేశ్వర్‌ నుంచి విశాఖకు ఏసీ చైర్‌ కార్‌ ప్రయాణానికి టికెట్‌ ధరను రూ.1,115గా నిర్ణయించారు. ఇందులో బేస్‌ ఫేర్‌ రూ.841, రిజర్వేషన్‌ ఛార్జి రూ.40, సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జి రూ.45, జీఎస్టీ రూ.47, కేటరింగ్‌ ఛార్జీ రూ.142గా నిర్ణయించారు. ఆహారం వద్దనుకుంటే టికెట్‌ ధర నుంచి ఆ మొత్తాన్ని మినహాయిస్తారు. ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ టికెట్‌ ధరను రూ.2,130గా నిర్ణయించారు. ఇందులో కేటరింగ్‌ ఛార్జిని రూ.175గా పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో చైర్‌ కార్‌ టికెట్‌ ధర రూ.1,280 గానూ, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.2,325గా నిర్ణయించారు. కేటరింగ్‌ ఛార్జీల్లో వ్యత్యాసం మూలంగా ఆ మేర తిరుగు ప్రయాణంలో టికెట్‌ ధరలో మార్పు ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని