మనకు ఇవి.. మరి చైనాకు?
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే ఆధునిక టెక్నాలజీతో దూసుకెళ్తూ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. అమెరికాతో పోటీ పడుతూ అగ్రరాజ్యంగా నిలవాలని తహతహలాడుతోంది. ఇటీవల కరోనా వైరస్ చైనా నుంచి బయటకొచ్చి అన్ని దేశాలను వణికిస్తుంటే.. ఆ దేశం మాత్రం కరోనా నుంచి కోలుకొని ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టుకుంటోంది. ఈ విషయమే కాదు.. చాలా అంశాల్లో ప్రపంచదేశాలతో పోలిస్తే చైనా కాస్త భిన్నంగానే వ్యవహరిస్తుంటుంది. ఇంటర్నెట్, సోషల్‌మీడియా విషయానికొస్తే వీటిపై ఆ దేశంలో చాలా ఆంక్షలుంటాయి. ప్రపంచం ఉపయోగించే సోషల్‌మీడియా, ఆన్‌లైన్ సేవలందించే ప్రముఖ వెబ్‌సైట్లను ఆ దేశం నిషేధించింది. వాటికి బదులు చైనాలోనే దేశీయంగా రూపొందించిన వెబ్‌సైట్స్.. యాప్స్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచింది. మరి ప్రపంచం వినియోగించేవి ఏవి? చైనా ఉపయోగించేవి ఏవి? ఓ లుక్కేద్దామా..
గూగుల్
ఏ సమాచారం కావాలన్నా ఇప్పటి నెటిజన్లంతా గూగుల్‌ను ఆశ్రయిస్తారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో సర్వం నిక్షిప్తమై ఉంటాయి. అన్వేషిస్తే చాలు.. కావాల్సిన సమాచారం చెంతకొస్తుంది. ప్రపంచమంతా ఈ గూగుల్‌ను వినియోగిస్తుంటే.. చైనా ఈ సెర్చ్ ఇంజిన్‌ను నిషేధించింది. కొన్నాళ్ల కిందట చైనాలోనూ గూగుల్ సేవలు అందించినా తర్వాత నిషేధానికి గురైంది. ప్రస్తుతం చైనా ప్రజలు గూగుల్‌కు బదులు ‘బైడు’ సెర్చ్‌ఇంజిన్‌ను వినియోగిస్తుంటారు. బీజింగ్ కేంద్రంగా 2000 సంవత్సరంలో ప్రారంభమైన బైడు సెర్చ్ ఇంజిన్‌పై కూడా కొన్ని ఆంక్షలు, నిరంతర నిఘా ఉంటుంది. బైడుతోపాటు బింగ్ సెర్చ్ ఇంజిన్‌కూడా చైనాలో అందుబాటులో ఉంది.
ఫేస్‌బుక్
ఫేస్‌బుక్‌తో ప్రపంచం ఏకమవుతుంది. కానీ, చైనా కలవదు. ఎందుకంటే ఆ దేశంలో ఫేస్‌బుక్‌పై నిషేధముంది. ఫేస్‌బుక్ బదులు అక్కడి ప్రజలు ‘రెన్రెన్’ను వినియోగిస్తారు. 2005 డిసెంబర్‌లో దీన్ని ప్రారంభించారు. అయితే ప్రస్తుతం దీనికీ పోటీ పెరగడంతో వినియోగం చాలా వరకు తగ్గింది.
ట్విటర్
వివిధ రంగాల్లోని ప్రముఖులు ఎక్కువగా వినియోగించే సోషల్‌మీడియా ట్విటర్. ఏ విషయాన్నైనా తక్కువ వాక్యాల్లో అభిమానులకు, ఫాలోవర్స్‌కు చెప్పగలగడం ఇందులోని ప్రత్యేకత. అయితే, చైనాలో ట్విటర్ స్థానంలో ‘వీబో’ వచ్చి చేరింది. 2009లో ప్రారంభమైన ఈ సోషల్‌మీడియా వెబ్‌సైట్.. చైనా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వీబోలో కొన్ని కోట్ల మంది యూజర్లు ఉన్నారు.
యూట్యూబ్
వీడియోషేరింగ్‌లో మొదటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ అని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వీడియో ప్లాట్‌ఫామ్స్ ఎన్ని వచ్చినా యూట్యూబ్‌కు ఏ మాత్రం విలువ తగ్గలేదు. అయితే, చైనాలో ఈ యూట్యూబ్‌ను నిలిపివేశారు. యూట్యూబ్‌కు బదులు ప్రముఖ వ్యాపార సంస్థ అలీబాబాకు చెందిన ‘యూకు.కామ్’ యూట్యూబ్‌కు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. 2006లో దీన్ని ప్రారంభించారు.
వాట్సాప్
ప్రపంచవ్యాప్తంగా 500కోట్లకుపైగా డౌన్‌లోడ్ సంఖ్య ఉన్న వాట్సాప్‌ను చైనా ప్రజలు అసలు ఉపయోగించరు. వారికంటూ ప్రత్యేకంగా ‘వీచాట్’ యాప్ ఉంది. వాట్సాప్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లకు ప్రత్యామ్నాయంగా ఈ వీచాట్ ఉపయోగపడుతోంది. దీంతోపాటు ‘క్యూక్యూ’ యాప్ మెసేజింగ్ పరంగానేకాదు.. షాపింగ్, మైక్రోబ్లాగింగ్, సోషల్ గేమ్స్ ఆడేందుకు, మ్యూజిక్ వినడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఈ రెండు యాప్స్‌ను టెన్సెంట్ సంస్థే రూపొందించింది.
జీ మెయిల్
జీమెయిల్, యాహూ, హాట్‌మెయిల్ తదితర సంస్థలు ఈ-మెయిల్ సేవలను అందిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది వాడేది మాత్రం జీమెయిల్‌నే. చైనాలో మాత్రం ఈ జీమెయిల్ వాడకం నిషేధం. యాహూ, హాట్‌మెయిల్స్ అందుబాటులో ఉన్నా వినియోగం తక్కువే. చైనీయులు ఎక్కువగా నెట్‌ఈజ్ (www.163.com)ను వాడుతుంటారు. అయితే, కొందరు జీమెయిల్‌ను వీపీఎన్‌ను మార్చి ఉపయోగిస్తుంటారు.
గూగుల్ మ్యాప్స్
గూగుల్ సంస్థ ఉత్పత్తులన్నింటిని నిషేధించిన చైనా.. గూగుల్ మ్యాప్స్‌ను మాత్రం ఎందుకు వదిలేస్తుంది? దాన్నీ చైనాలో ఉపయోగించుకుండా అడ్డుకుంది. అయితే గూగుల్ మ్యాప్స్‌కి బదులుగా అక్కడి ప్రజలు బైడు మ్యాప్స్, రష్యాకు చెందిన ‘మ్యాప్స్.మీ’ని ఎక్కువగా వాడుతుంటారు.
కోరా
ఏ అంశంలోనైనా సందేహాలు ఉంటే నిపుణుల సమాధానాల కోసం ‘కోరా’ను ఆశ్రయిస్తుంటారు. ఇందులో నెటిజన్లు అడిగే ప్రశ్నలకు నిపుణులు సమాధానం ఇస్తుంటారు. చైనాలో దీనికి ‘జిహూ’ ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.
టిండర్
డేటింగ్ యాప్స్‌లో ఎక్కువమంది ఉపయోగించేది టిండర్. చైనాలో టిండర్‌కు బదులుగా చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ‘మోమో’ యాప్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Viral-videos News
Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
-
Politics News
Bihar politics: నీతీశ్‌ను ఉపరాష్ట్రపతి చేయాలని అడిగారు: భాజపా ఆరోపణ
-
General News
Pancreatitis: కడుపులో నొప్పిగా ఉంటుందా..? ఇది ఎలా వస్తుందో తెలుసా..
-
Movies News
Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
-
Politics News
Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
-
Politics News
jagadishreddy: మునుగోడులో తెరాస నేతలందరూ ఐక్యంగానే ఉన్నారు: జగదీశ్‌రెడ్డి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naga Chaitanya: అది నా పెళ్లి తేదీ.. దయచేసి ఎవరూ ఫాలో కాకండి: నాగచైతన్య
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Langya virus: చైనాలో జంతువుల నుంచి మరో కొత్తవైరస్ వ్యాప్తి
- Poorna: పెళ్లి క్యాన్సిల్ వార్తలపై పూర్ణ ఏమన్నారంటే..!
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Vijay Deverakonda: ప్రమోషన్స్‌కి చెప్పులేసుకెళ్లడానికి కారణమదే: విజయ్ దేవరకొండ
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Gorantla madhav: మాధవ్ వీడియో ఒరిజినల్ కాదు.. అసలు వీడియో దొరికితేనే క్లారిటీ: అనంతపురం ఎస్పీ