CM Jagan: ఈ ప్రాజెక్టుతో చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాలో ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ పవర్‌ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.

Updated : 17 May 2022 16:25 IST

ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాలో ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ పవర్‌ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఒకే యూనిట్‌లో సౌర, పవన, హైడల్‌ విద్యుదుత్పాదన జరుగుతుందని.. ఈ ప్రాజెక్టు ద్వారా చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు.

శిలాజ ఇంధనం ద్వారా విద్యుదుత్పత్తిని తగ్గించే ఈ ప్రాజెక్ట్‌ దేశానికి సరికొత్త మార్గం చూపుతుందని జగన్‌ వ్యాఖ్యానించారు. నిరంతరం పునరుత్పాదక విద్యుదుత్పత్తి చేయడం ఈప్రాజెక్టు ప్రత్యేకత అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన ఈ ప్రాజెక్టు.. భవిష్యత్తులో మిగిలిన రాష్ట్రాలు అమలు చేసేందుకు ఆదర్శంగా ఉంటుందని సీఎం అన్నారు. ఈ ప్రాజెక్టును గ్రీన్‌కో ఎనర్జీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.15వేల కోట్ల పెట్టుబడితో చేపడుతోందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని