CM KCR: హైదరాబాద్‌కు అందమైన ఆధ్యాత్మిక కేంద్రం వస్తోంది: కేసీఆర్‌

కరోనా సమయంలో హరేకృష్ణ ఫౌండేషన్‌ ప్రజలకు ఎన్నో సేవలు అందించిందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు.

Updated : 08 May 2023 15:35 IST

హైదరాబాద్‌: కరోనా సమయంలో హరేకృష్ణ ఫౌండేషన్‌ ప్రజలకు ఎన్నో సేవలు అందించిందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. నగర శివారు నార్సింగి వద్ద హరేకృష్ణ మూవ్‌మెంట్‌ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 400 అడుగుల ఎత్తుగల ‘హరేకృష్ణ హెరిటేజ్‌ టవర్‌’ (ఆలయం) నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. భూమిపూజ అనంతరం నిర్మాణ శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌కు అందమైన ఆధ్యాత్మిక కేంద్రం వస్తోందని చెప్పారు. మతమౌఢ్యంతో సమాజానికి కొందరు ఇబ్బందులు కలిగిస్తున్నారని.. విశ్వశాంతి కోసం అందరం ప్రార్థన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హరేకృష్ణ ఫౌండేషన్‌ మంచి కార్యక్రమాలు చేపడుతోందన్నారు.  ‘అక్షయపాత్ర’ కార్యక్రమం చాలా బావుందని కేసీఆర్‌ కొనియాడారు. చిత్తశుద్ధి ఉంటేనే అలాంటి కార్యక్రమాలు నడుస్తాయని చెప్పారు. హెరిటేజ్‌ టవర్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. త్వరలోనే ఆ నిధులను విడుదల చేస్తామన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని