KCR: ఉజ్జయిని మహాకాళికి బోనం సమర్పించిన కేసీఆర్‌

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు బోనం సమర్పించారు.

Updated : 09 Jul 2023 13:50 IST

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. ఆలయ సిబ్బంది కేసీఆర్‌ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత మహాకాళిని దర్శించుకొని బంగారు బోనం సమర్పించారు.

మహాకాళి అమ్మవారి బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రభుత్వం ప్రతిఏటా వైభవంగా నిర్వహిస్తోంది. ఆషాఢమాసంలో గ్రామదేవతలను పూజిస్తూ.. ప్రారంభమయ్యే ఈ బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనం. స్థానికులు డబ్బుచప్పుళ్లతో నెత్తిన బోనమెత్తి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. ప్రజల వేషభాషలను ప్రతిబింబిస్తూ వారిలో ఐక్యత పెంపొందించేలా బోనాల పండగ సాగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని