CM KCR: యాసంగి వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి: సీఎం కేసీఆర్‌ ఆదేశం

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Published : 09 Apr 2023 20:15 IST

హైదరాబాద్‌: యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాలకు సంబంధించి తక్షణ చర్యల్లో భాగంగా సోమవారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెర్స్‌ నిర్వహించి సంబంధిత ఏర్పాట్లు, కార్యాచరణకు చర్యలు చేపట్టాలని సీఎస్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. గతంలో నిర్వహించిన విధంగానే ఈసారి కూడా 7వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని