CM KCR: ప్రతి భారతీయుడు సైనికులకు అండగా ఉంటాడు: సీఎం కేసీఆర్
గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన 10 మంది బిహార్ సైనికులకు సీఎం కేసీఆర్ రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. బిహార్ పర్యటనలో భాగంగా
పట్నా: గల్వాన్ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు బిహార్ సైనికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. బిహార్ పర్యటనలో భాగంగా పట్నా చేరుకున్న ఆయన.. తొలుత ఆ రాష్ట్ర సీఎం నీతీశ్ కుమార్‌తో భేటీ అయ్యారు. కేసీఆర్.. నేరుగా బిహార్ సీఎం నీతీశ్ కార్యాలయానికి వెళ్లారు. కేసీఆర్‌కు నీతీశ్‌తో పాటు బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఘనస్వాగతం పలికారు. అనంతరం నీతీశ్‌తో కలిసి ఆర్థికసాయం పంపిణీ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమరుల కుటుంబాలకు నీతీశ్‌తో కలిసి చెక్కులు అందించారు. దీంతో పాటు కొద్దినెలల క్రితం సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన 12 మంది బిహార్ వలస కార్మికుల కుటుంబాలకూ రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు.
కార్మికుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాం: కేసీఆర్
ఆర్థిక సాయం చెక్కులు అందించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘బిహార్‌లో చేపట్టే మంచి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. దేశం కోసం అమర జవాన్లు ప్రాణాలు అర్పించారు. వారి త్యాగం వెలకట్టలేనిది. ప్రతి ఒక్క భారతీయుడు.. సైనికులకు అండగా ఉంటాడు. కరోనా సమయంలో వలస కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు. స్వగ్రామానికి చేర్చడానికి కార్మికుల కోసం రైళ్లను ఏర్పాటు చేశాం. తెలంగాణ అభివృద్ధిలో బిహార్ వలస కార్మికులు భాగస్వాములయ్యారు. అలాంటి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాం’’ అని కేసీఆర్ తెలిపారు.
ఆ ఆలోచన చాలా గొప్పది: నీతీశ్ కుమార్
గల్వాన్ ఘటనలో అమరులైన జవాన్లకు, హైదరాబాద్ ఘటనలో చనిపోయిన కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని బిహార్ సీఎం నీతీశ్‌కుమార్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచన చాలా గొప్పదని కొనియాడారు. కరోనా సమయంలో వలస కార్మికులను ఆదుకున్నారని.. వారి పట్ల కేసీఆర్ చూపిన శ్రద్ధ మరువలేనిదని ప్రశంసించారు. ‘‘తెలంగాణ ఏర్పాటు కోసం 2001 నుంచి కేసీఆర్ పోరాడారు. ఆయన కృషి, పట్టుదల వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైంది. ఉద్యమ నాయకుడే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రగతి పథంలో సాగుతోంది. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించారు. రెండు నదుల నీళ్లను సద్వినియోగం చేసుకుంటున్నారు. బిహార్‌లోనూ గంగా జలాన్ని అన్నిచోట్లకు అందించేందుకు కృషి చేస్తున్నాం. జలవిధానాలు పరిశీలించేందుకు త్వరలోనే అధికారులను తెలంగాణకు పంపుతాం’’అని నీతీశ్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Turkey Earthquake: భూకంప విలయం.. రంగంలోకి శాటిలైట్లు!
-
India News
NEET PG exam: నీట్ పీజీ పరీక్ష షెడ్యూల్లో మార్పు వార్తల్ని నమ్మొద్దు: కేంద్రం
-
General News
APSRTC: శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ
-
Sports News
Asia Cup 2023: ‘వారు నరకానికి పోవాలనుకోవడం లేదు’’..: వెంకటేశ్ ప్రసాద్
-
General News
KTR: హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
General News
Supreme Court: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. అత్యవసర విచారణకు సీజేఐకి విజ్ఞప్తి