CM KCR: అగ్నిప్రమాద ఘటనపై కేసీఆర్‌ దిగ్భ్రాంతి.. రూ.5లక్షల పరిహారం ప్రకటన

సికింద్రాబాద్‌ బోయగూడలో ఈ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో బిహార్‌ కార్మికుల మృతిపై

Updated : 23 Mar 2022 09:56 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ బోయగూడలో ఈ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో బిహార్‌ కార్మికుల మృతిపై సంతాపం తెలిపారు. అగ్నిప్రమాదంలో మరణించిన వారికి రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు.

బోయగూడ ఐడీహెచ్‌ కాలనీలోని స్క్రాప్‌ దుకాణంలో ఈ ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి  ఈ దుకాణంలో 15 మంది కార్మికులు నిద్రించారు. తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్‌ జరగడంతో అందులో భారీగా మంటలు చెలరేగాయి. ఇద్దరు కార్మికులు ప్రమాదం నుంచి బయట పడగా.. మిగిలిన 13 మంది మంటల్లో చిక్కుకున్నారు. వీరిలో 11 మంది సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని