Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/07/2022)

ఈ రోజు ఎవరి రాశి ఫలం ఎలా ఉందంటే? (28/07/22)

Updated : 28 Jul 2022 04:13 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

లక్ష్యాలను చేరుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వస్త్ర లాభం పొందుతారు. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

మిశ్రమకాలం. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మనఃపీడ ఉంటుంది. మనోబలం కోసం దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

విఘ్నాలను తెలివిగా పరిష్కరిస్తారు. చంచల స్వభావంతో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ పై అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. దుష్టులను దరిచేరనీయకండి. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో  కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. శివనామాన్ని జపించండి.

మీ మీ రంగంలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీ బంధువుల ప్రవర్తన మీకు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. శ్రీహరిని ఆరాధిస్తే మంచిది.

చేపట్టిన పనులలో ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. శివారాధన శుభప్రదం.

పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ముఖ్య విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కలహ సూచన ఉంది కాబట్టి మాట విలువను కాపాడుకోవాలి. హనుమత్ ఆరాధన శుభప్రదం.

ధర్మసిద్ధి ఉంది. సమస్యలు తొలగి కుదురుకుంటారు. భోజన సౌఖ్యం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే బాగుంటుంది.
 

మీ మీ రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి.అందరినీ కలుపుకొనిపోవడం ఉత్తమం. శ్రీసూక్తం విన్నా, చదివినా మంచి ఫలితాలు సాధిస్తారు.

 

గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో అభివృద్ధికి  సంబంధించిన  శుభవార్త వింటారు. ఒక శుభవార్త  మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. బుద్ధిబలం బాగుండటం వలన కీలక సమయాలలో పెద్దలు లేదా అధికారుల మెప్పు పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.  

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఒక వార్త  మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. అనవసర  విషయాల్లో తలదూర్చరాదు. నృసింహస్వామి ఆరాధన శుభప్రదం.

బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ధన,ధాన్యవృద్ధి ఉంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. శివనామస్మరణ శుభప్రదం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని