Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31-10-2021 )

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31-10-2021)

Updated : 31 Oct 2021 06:58 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మిశ్రమ వాతావరణం కలదు. ఉత్సాహంగా పని చేస్తే తప్ప పనులు పూర్తికావు. సమయానికి నిద్రాహారాలు అవసరం. పెద్దల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. శని ధ్యానం శుభప్రదం.

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు చేతికి అందుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే మంచిది. 

శుభ కాలం. ప్రయత్న కార్యానుకూలత ఉన్నది. అభివృద్ధి కోసం చేసే పనులు సఫలీకృతమవుతాయి.  ఆర్థిక అంశాల్లో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. బలమైన ప్రయత్నం ఫలిస్తుంది. బంధుమిత్రులతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దుర్గా దేవిని ఆరాధిస్తే మంచిది. 

ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి. చంచల స్వభావాన్ని వీడండి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి.   ఈశ్వర ధ్యానం శుభప్రదం.

మంచి ఫలితాలను అందుకుంటారు. ఆరోగ్యం అన్నివిధాలా సహకరిస్తుంది. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాన్నిస్తుంది.

తోటివారి సహకారంతో పనులు పూర్తిచేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మొదలుపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనా.. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మంచిది. 

ప్రయత్న కార్యసిద్ధి ఉంది. మీ మీ రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది.  స్వస్థాన ప్రాప్తి సూచనలున్నాయి. చంద్ర గ్రహ ఆరాధన శుభప్రదం.  

 

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పనులను ప్రారంభించే ముందు మంచి, చెడులను గమనించాలి. కీలక వ్యవహారంలో ముందుచూపు అవసరం. విష్ణు సందర్శనం శుభప్రదం.

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు శుభఫలితాలను అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మనోబలం పెరగటానికి లక్ష్మీ ధ్యానం శుభప్రదం.
 

మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మంచిది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని