Gold Chain: ఇదేం హెయిర్‌స్టైల్‌ రా బాబూ!

చూడగానే ఇదేం ఫ్యాషన్‌ రా బాబూ అనుకోకండి! ఇదేమీ ఫ్యాషన్‌ కోసం కాదు. ట్రెండ్‌ అంతకన్నా కాదు. అసలు దీని కథేమిటంటే... ఇతగాడి పేరు డాన్‌ సుర్‌. మెక్సికోలో ఫేమస్‌ ర్యాపర్‌. ఆభరణాలను అమితంగా ఇష్టపడే డాన్‌ ఏకంగా శస్ర్తచికిత్స చేయించుకొని మరీ ఇన్ని గొలుసులను తలకు అమర్చుకున్నాడట. మానవ చరిత్రలో తొలిసారి ఆభరణాలను తలకు అలంకరించుకున్న ర్యాపర్‌గా చరిత్రలోకి ఎక్కాడు ఈ 23ఏళ్ల యువకుడు. దీని కోసమని ఈఏడాది ఏప్రిల్‌లో తలకు శస్ర్తచికిత్స చేయించుకోగా.

Published : 15 Sep 2021 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చూడగానే ఇదేం ఫ్యాషన్‌ రా బాబూ అనుకోకండి! ఇదేమీ ఫ్యాషన్‌ కోసం కాదు. ట్రెండ్‌ అంతకన్నా కాదు. అసలు దీని కథేమిటంటే... ఇతగాడి పేరు డాన్‌ సుర్‌. మెక్సికోలో ఫేమస్‌ ర్యాపర్‌. ఆభరణాలను అమితంగా ఇష్టపడే డాన్‌ ఏకంగా శస్ర్తచికిత్స చేయించుకొని మరీ ఇన్ని గొలుసులను తలకు అమర్చుకున్నాడట.  ఆభరణాలను తలకు అలంకరించుకున్న ర్యాపర్‌గా చరిత్రలోకి ఎక్కాడు ఈ 23ఏళ్ల యువకుడు. దీని కోసమని ఈఏడాది ఏప్రిల్‌లో తలకు శస్ర్తచికిత్స చేయించుకోగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు. అసలు ఇతగాడికి ఎందుకిలా చేయాలని అనిపించిందంటే.. అందరిలా జుట్టుకి రంగు వేసుకోవడం లేదా విగ్‌ ధరించడం నచ్చదంట డాన్‌కి. ఏదైనా సరే! ‘థింక్‌ డిఫరెంట్‌’గా ఆలోచించే డాన్‌.. అందరూ హెయిర్‌స్టైల్‌ డిఫరెంట్‌గా కనిపించడానికి రకరకాల హెయిర్‌డై వేస్తుంటారు. నేనుమాత్రం అలా కాదు ఇప్పుడు మాత్రం నన్ను చూసి కాపీకొట్టరని భావిస్తున్నా’’ అంటూ చెప్పుకొచ్చాడు



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని