జగన్‌ నుంచి ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించండి: సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్‌

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి సీబీఐ కోర్టులో ప్రొటెక్షన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated : 12 Mar 2024 13:29 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి సీబీఐ కోర్టులో ప్రొటెక్షన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని.. రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. తన కుటుంబానికి ఏపీ సీఎం జగన్, ఆయన సతీమణి భారతి, అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆయన కుమారుడు చైతన్య రెడ్డి నుంచి ప్రాణ హాని ఉందని పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తన కుటుంబానికి రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు ఎంపీ అవినాష్‌ బెయిల్‌ రద్దు చేయాలని దస్తగిరి హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

దస్తగిరి అప్రూవర్‌ పిటిషన్‌పై కోర్టులో వాదనలు ముగిశాయి. తనను ఈ కేసులో ముద్దాయిగా కాకుండా సాక్షిగానే పరిగణించాలని పిటిషన్‌ వేశారు. దీనిపై తీర్పును సీబీఐ కోర్టు రిజర్వ్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని