Coronavirus: ఫస్ట్‌.. సెకండ్‌వేవ్‌కు తేడా ఇదే!

సెకండ్‌ వేవ్‌లో యువత అధికంగా కరోనా వైరస్‌ బారిన పడింది. అదే సమయంలో పాటు మరణాలు కూడా అధికంగా ఉన్నాయి. మరోవైపు థర్డ్‌వేవ్‌

Updated : 06 Jun 2021 18:25 IST

సెకండ్‌ వేవ్‌లో యువత అధికంగా కరోనా వైరస్‌ బారిన పడింది. అదే సమయంలో పాటు మరణాలు కూడా అధికంగా ఉన్నాయి. మరోవైపు థర్డ్‌వేవ్‌ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో  వ్యాక్సిన్‌ తీసుకుని, స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ ముందు సాగాలని వైద్యులు సూచిస్తున్నారు. మరి వైరస్‌ కట్టడికి మనం ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?తదితర విషయాలను ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్‌ గురువారెడ్డి వివరించారు.

* ‘‘ఫస్ట్‌ వేవ్‌కూ సెకండ్‌వేవ్‌కూ కొన్ని భేదాలున్నాయి. సెకండ్‌వేవ్‌లో దగ్గు, జ్వరం ఎక్కువగా వస్తున్నాయి. అత్యధికులు వాసన కోల్పోతున్నారు’’

* ‘‘కొత్తగా వస్తున్న మ్యూటెంట్స్‌ వల్ల ఆర్టీపీసీఆర్‌లో పరీక్షలు చేసినా, నెగెటివ్‌ వస్తోంది. నెగెటివ్‌ వచ్చినంత మాత్రాన అజాగ్రతగా ఉండకూడదు. ఏమాత్రం లక్షణాలు ఉన్నా, వైద్యుల సూచన మేరకు సిటీ స్కాన్‌ చేయించుకోవడం ముఖ్యం’’

* ‘‘కరోనా సోకిన వారిలో 90శాతం మందికి ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే, శరీర ఉష్ణోగ్రత రోజూ పెరుగుతూ నాలుగు రోజుల పాటు కొనసాగడం.. తీవ్రమైన దగ్గు.. పల్స్‌ 92 కన్నా తక్కువ చూపించటం.. మాట్లాడుతున్నా ఆయాసం వస్తే కచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాలి’’

* ‘‘సెకండ్‌ వేవ్‌లో యువత అత్యధికంగా కరోనా బారిన పడుతోంది. బయటకు వెళ్లేటప్పుడు భౌతికదూరం పాటించండి. తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి’’

* ‘‘ఇక ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. ఏ వ్యాక్సిన్‌ తీసుకున్నా పర్వాలేదు. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ రెండూ అంతర్జాతీయంగా మంచి ప్రమాణాలతో తయారు చేసినవే. కాబట్టి ఏ వ్యాక్సిన్‌ దొరికితే అది వేయించుకోండి’’


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని