Dudhsagar Waterfalls: సొగసు చూడతరమా..!

సరదాగా ప్రకృతి ఒడిలో సేద తీరాలంటే పర్యాటక ప్రేమికులకు ముందుగా

Published : 30 Jul 2021 00:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సరదాగా ప్రకృతి ఒడిలో సేద తీరాలంటే పర్యాటక ప్రేమికులకు ముందుగా గుర్తుకు వచ్చేది పశ్చిమ కనుమలే! ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఈ ప్రాంతంలోని దూద్‌సాగర్ జలపాతం భూతల స్వర్గాన్ని తలపిస్తోంది. ఎత్తైన కొండల మధ్య పాలధారలా జారువాలుతూ పర్యాటకులకు సరికొత్త అనుభూతుల్ని పంచుతోంది. పెద్ద పెద్ద కొండల మధ్య నుంచి పరుగులు తీసే శ్వేత వర్ణపు దూద్‌సాగర్‌ జలపాతాన్ని చూసి ప్రకృతి ప్రేమికులు పరవశించిపోతున్నారు. రైలు ప్రయాణంలో అనుకోకుండా పలకరించిన అతిథిని తమ స్మార్ట్‌ ఫోన్‌లో వీడియో తీసి భద్రంగా దాచుకుంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మంగళూరు, ముంబయి రైలు మార్గంలోని దూద్‌సాగర్‌ జలపాతం ఉద్ధృతంగా జాలువారుతుంది. అధిక ప్రవాహం వల్ల ట్రాకుపై బురదనీరు చేరడంతో అధికారులు రైళ్లను కాసేపు నిలిపివేశారు. దాంతో రైల్లోని ప్రయాణికులు అరుదైన ప్రకృతి దృశ్యాలు వీక్షించారు. జలపాతం అందాలను వీడియోలు అస్వాదించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని