Siddipet: చెక్కులిచ్చే వరకు కదలం.. తహసీల్దార్‌ కార్యాలయంలో రైతులు, ఎమ్మెల్యే బైఠాయింపు

సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో మల్లన్న సాగర్‌ అదనపు టీఎంసీ కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు ఆందోళనకు దిగారు. 

Published : 14 Jul 2023 17:05 IST

తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో మల్లన్న సాగర్‌ అదనపు టీఎంసీ కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు ఆందోళనకు దిగారు. ఘనపురానికి చెందిన 70 మంది రైతులు భూపరిహారం చెక్కుల కోసం ఉదయం 10గంటల నుంచి తహసీల్దార్‌ కార్యాలయంలో భీష్మించుకు కూర్చున్నారు. చెక్కులు పంపిణీ చేసేందుకు తహసీల్దార్‌ నిరాకరించారు. ఈ విషయంపై నిర్వాసితులు.. దుబ్బాక భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌ రావుకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే తహసీల్దార్‌తో మాట్లాడారు.

జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేస్తామని తహసీల్దార్‌ తెలిపారు. పరిహారం చెక్కులు తహసీల్దార్‌ కార్యాలయానికి వస్తే నిర్వాసితులు కలెక్టర్‌ కార్యలయానికి ఎందుకు వెళ్లి తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఫొటోల కోసం నిర్వాసితులను కలెక్టర్‌ కార్యాలయానికి పిలవడం సమంజసం కాదన్నారు. చెక్కులు ఇవ్వడం ప్రారంభిస్తే ఇక్కడి నుంచి వెళ్లిపోతానని ఎమ్మెల్యే.. తహసీల్దార్‌కు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని