kids: పిల్లలకి ఈ పద్ధతిలో సులువుగా నేర్పించేయండి!

పిల్లలు వేళకు తిని చక్కగా చదువుకుంటే తల్లిదండ్రులకు ఎలాంటి బాధలు ఉండవు. కానీ పిల్లలు ఈ రెండు విషయాల్లో పేరెంట్స్‌ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అయితే పిల్లలు హోం వర్క్‌ ఆడుతూ పాడుతూ చేసేందుకు తల్లిదండ్రులు కాస్త ఎక్కవ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

Published : 17 Sep 2022 01:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లలు వేళకు తిని చక్కగా చదువుకుంటే తల్లిదండ్రులకు ఎలాంటి బాధలు ఉండవు. కానీ పిల్లలు ఈ రెండు విషయాల్లో పేరెంట్స్‌ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అయితే పిల్లలు హోం వర్క్‌ ఆడుతూ పాడుతూ చేసేందుకు తల్లిదండ్రులు కాస్త ఎక్కవ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వారితో కాస్త సమయం కేటాయించాల్సి ఉంటుంది.  వాళ్లు హోం వర్క్ చేసేందుకు ఏం చేస్తే ఉత్సాహం చూపిస్తారో తెలుసుకుందాం రండి.

* ఎంతసేపు పుస్తకాల్లో ఉన్నది నేర్చుకోవడం. అప్పజెప్పడం పిల్లలకు చాలా ఇబ్బంది కలిగించే అంశం. కాబట్టి వారికి పరికరాల రూపంలో చెప్పే ఆలోచన చేయండి. ఎలా అంటే ఎప్పుడూ పుస్తకాల్లో ఉండే బొమ్మలు చూపించి ఏ ఫర్‌  యాపిల్‌, బి ఫర్‌ బాల్‌ అనే పద్ధతి ఏంత మాత్రం మంచిది కాదు. తినేటప్పుడు ఆడుకునేటప్పుడు ఆ వస్తువులు ఏమిటో, వాటిని ఎందుకు ఉపయోగిస్తారో వివరంగా చెప్తే పిల్లలకి బాగా గుర్తుకుంటుంది.  

మీరూ పిల్లల్లా మారిపోండి..

* పిల్లలతో కొన్ని యాక్టివిటీస్‌ చేయించండి. బొమ్మలు గీయడం, వాటికి రంగులు వేయడం వంటి పనులు చేయించండి. మంచి ప్రతిభ కనబరిస్తే బహుమతులు ఇవ్వండి. తద్వారా పిల్లలు మరింత ఆసక్తిగా చేసేందుకు వీలుంటుంది.  ఇలా చేయడం వల్ల వారి ఊహాత్మక శక్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

ఆంక్షలు విధించకూడదు

కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు ఎక్కువగా అది చేయకూడదు, ఇది చేయకూడదని ఆంక్షలు విధిస్తుంటారు. కానీ, ఎందుకు చేయకూడదో తెలియజేయాలి. ఏ పని చేస్తే ఎలాంటి ఫలితాలుంటాయో అర్థం అయ్యేలా చెప్పాలి.

* ఇంట్లో మొక్కలు ఉంటే వాటి సంరక్షణా బాధ్యత పిల్లలకి అప్పజెప్పాలి. దీంతో పని చేసే గుణంతో పాటు పకృతితో వారికి ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది.

* సెలవు రోజుల్లో బయటకు వెళ్తుంటారు.  విహారం కోసం వెళ్లినప్పటికీ అక్కడ ఉండే జంతువుల గురించి, పక్షుల గురించి వాటి అరుపులు, ఆహారపు అలవాట్లు, వాటి ఆహార్యం గురించి వివరించి చెప్పాలి. 

* పనులు నేర్పించండిలా!

తల్లులు వంట చేస్తున్నపుడు పిల్లల్ని కిచెన్‌లోకి రానివ్వరు. కానీ పిల్లలు ఆడ, మగ ఎవరైనా సరే.. కిచెన్‌లో చేసే పనుల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆ విషయాలు తెలియజేయడంలో తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న పనులు వారితో చేయించాలి. చిన్నప్పటి నుంచి అన్ని పనులు నేర్పిస్తేనే పెద్దయ్యాక మరొకరి మీద ఆధారపడకుండా ఎవరి పనులు వారే చేసుకునేందుకు వీలుంటుంది.

పైన తెలిపిన పనులు చేసేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించుకోనవసరం లేదు. రోజు వారీగా జరిగే పనుల్లో పిల్లలకు ఎన్నో విషయాలను చెప్పవచ్చు. పిల్లలకు ఏం చెప్పినా వారికి అర్థమయ్యే విధంగా, వారి స్థాయికి వెళ్లి చెప్పాలి. దీంతో పిల్లలకి మంచి ప్రవర్తన అలవడుతుంది. అన్ని విషయాలను బట్టి పట్టినట్లు కాకుండా వాటి గురించి ఆకళింపు చేసుకునేందుకు వీలుంటుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని