తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. గోవింద నామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. తెల్లవారక ముందే భక్తులు ఆలయాలకు చేరుకోవడంతో కిక్కిరిసి పోయాయి. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు భక్తుల భారీగా తరలివచ్చారు. వీఐపీ

Updated : 06 Jan 2020 10:17 IST


ఇంటర్నెట్‌ డెస్క్‌: ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. గోవింద నామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. తెల్లవారక ముందే భక్తులు ఆలయాలకు చేరుకోవడంతో కిక్కిరిసి పోయాయి. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు భక్తుల భారీగా తరలివచ్చారు. వీఐపీ బ్రేక్‌ అనంతరం సర్వదర్శనానికి తితిదే ఏర్పాట్లు చేసింది. దీంతో భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. వీఐపీ బ్రేక్‌ దర్శనంలో  ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర మహేశ్వరి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌, ఏపీకి చెందిన మంత్రులు పుష్ప శ్రీవాణి, పెద్దిరెడ్డి, అనిల్‌, అవంతి శ్రీనివాస్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఆదిమూలపు సురేష్‌, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణకు చెందిన మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు స్వామివారిని దర్శించుకున్నారు. 

ఇక దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఉత్తర ద్వార దర్శనం సాగుతోంది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకోవడానికి తెలంగాణ మంత్రులు పువ్వాడ అజయ్‌ దంపతులు, సత్యవతి రాఠోడ్‌ వచ్చారు. ఉదయం ఆరుగంటల వరకు ఉత్తరద్వార దర్శనం సాగనుంది. అనంతరం గరుడ వాహనంపై సీతాలక్ష్మణ సమేత రాములవారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. 

మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. స్వామివారి వైకుంఠ దర్శనం కోసం భక్తుల పెద్దఎత్తున తరలివచ్చారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని