కేంద్రం ఎదుట గోడు చెబుతాం: రాజధాని ఐకాస

రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలియజేసేందుకు అమరావతి రైతులు, ఐకాస నేతలు దిల్లీకి వెళ్లారు. దాదాపు 45 రోజులకు పైగా రాజధాని అంశంపై పోరాటం...

Published : 02 Feb 2020 01:50 IST

దిల్లీ: రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలియజేసేందుకు అమరావతి రైతులు, ఐకాస నేతలు దిల్లీకి వెళ్లారు. దాదాపు 45 రోజులకు పైగా రాజధాని అంశంపై పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దిల్లీలో అమరావతి ఐకాస నేతలు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తామని చెప్పారు. రైతుల పోరాటానికి తగిన న్యాయం చేయాలని కోరుతామన్నారు.

‘‘ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోంది.  రాజధానిలో ఇప్పటి వరకు 30 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. కేంద్రం నుంచి కూడా చనిపోయిన రైతులకు సంతాపం తెలపలేదు. ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఒకే రాజధాని-ఒకే రాష్ట్రం మా నినాదం. మా లక్ష్యం కూడా అదే. రాజధాని అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జీఎన్‌రావు కమిటీ సహా ఏ కమిటీ వల్ల ప్రయోజనం లేదు’’ అని రాజధాని రైతులు మీడియా ఎదుట వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని