పదో తరగతి పరీక్షలు: ఆంగ్లం అంటే భయమా?

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ సహజంగానే విద్యార్థుల్లో ఆందోళనలు మొదలవుతాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఏడాది పదో పరీక్ష విధానంలో సంస్కరణలు తీసుకొచ్చింది.. 

Published : 08 Feb 2020 20:32 IST

హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ సహజంగానే విద్యార్థుల్లో ఆందోళనలు మొదలవుతాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఏడాది పదో పరీక్ష విధానంలో సంస్కరణలు తీసుకొచ్చింది. పరీక్షల విధానాల మార్పులపై అవగాహన పెంచుకొని విద్యార్థులు సిద్ధమైతే గరిష్ఠ మార్కులు సాధించవచ్చు. ఇంగ్లీష్‌ సబ్జెక్టులో మంచి మార్కులు ఎలా సాధించాలి. వాటిని సాధించే క్రమంలో విద్యార్థులకు సమస్యలు ఎదురవడం సాధారణం. కాని వాటిని అధిగమించి కష్టపడితే ఆశించిన ఫలితాలను సాధించవచ్చు అంటున్నారు సబ్జెక్ట్‌ నిపుణులు.  

ఇంగ్లీష్‌ పేపర్‌-1 గ్రామర్‌ విభాగంలో ఎడిటింగ్‌ ప్యాసేజ్‌, ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్‌ సెంటెన్సెస్‌, ఆర్టికల్స్‌, ప్రిపోజిషన్స్‌ వంటి అంశాలను విద్యార్థులు బాగా సాధన చేసినప్పుడే విద్యార్థులు మంచి మార్కులు సాధించుకోవచ్చు. పేపర్‌-2లో ప్రాథమికంగా వచ్చిన మార్పులు ఏమిటి? వాటిని ఎలా అర్థం చేసుకొని చదవాలి? వచ్చే ప్రశ్నలను ఎలా రాయాలి? అన్న సందేహాలకు ఉపాధ్యాయులు ఇచ్చిన వివరణను ఈ వీడియోలో చూడండి..

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని