మంత్రి తలసానికి రూ. 5 వేల జరిమానా

అనుమతి లేని ప్రాంతంలో కటౌట్‌ ఏర్పాటు చేసినందుకు గాను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు హైదరాబాద్‌ నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) శనివారం జరిమానా విధించింది. నెక్లెస్‌ రోడ్డులోని జలవిహార్‌లో ఈ నెల 17న నిర్వహిస్తున్న

Updated : 16 Feb 2020 10:54 IST

ఖైరతాబాద్‌: అనుమతి లేని ప్రాంతంలో కటౌట్‌ ఏర్పాటు చేసినందుకు గాను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు హైదరాబాద్‌ నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) శనివారం జరిమానా విధించింది. నెక్లెస్‌ రోడ్డులోని జలవిహార్‌లో ఈ నెల 17న నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి జన్మదినోత్సవాలను పురస్కరించుకుని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తన ఫొటోతో పాటు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల చిత్రాలతో భారీ కటౌట్‌ను నెక్లెస్‌ రోటరీ వద్ద ఏర్పాటు చేశారు. కటౌట్లకు అనుమతి లేనిచోట నిబంధనల్ని అతిక్రమించారంటూ జీహెచ్‌ఎంసీకి ఆన్‌లైన్‌ ద్వారా ఓ వ్యక్తి ఫిర్యాదు పంపారు. దీంతో మంత్రి తలసానికి అధికారులు రూ.5 వేల జరిమానాతో కూడిన చలాన్‌ వేశారు. ఆ జరిమానాను చెల్లించినట్లు మంత్రి సన్నిహితవర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు శనివారం రాత్రి సంబంధిత కటౌట్‌ను జీహెచ్‌ఎంసీ సిబ్బంది అక్కడి నుంచి తొలగించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని