ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి గాయం

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) గాయపడ్డారు. శుక్రవారం రాత్రి అమరావతి పరిధిలోని ఉండవల్లిలో ఓ వివాహ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. నూతన వధూవరులను

Published : 28 Feb 2020 22:38 IST

అమరావతి: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) గాయపడ్డారు. శుక్రవారం రాత్రి అమరావతి పరిధిలోని ఉండవల్లిలో ఓ వివాహ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న సమయంలో వేదిక కూలింది. ఈ ఘటనలో ఆర్కే కాలి మడమకు దెబ్బ తగలడంతో గాయామైంది. దీంతో అనుచరులు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆర్కేను పరీక్షించిన వైద్యులు.. కాలికి కట్టు కట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని