శ్రీశైలంలో క్యూలైన్‌లో భక్తులకు శానిటైజర్‌!

కరోనా ప్రభావంతో అప్రమత్తమైన తెలుగు రాష్ట్రాలు తగు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ సమయంలో ప్రజలకు సూచనలు చేయడంతోపాటు...

Published : 13 Mar 2020 14:44 IST

 శ్రీశైలం: కరోనా వైరస్‌ ప్రభావంతో అప్రమత్తమైన తెలుగు రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. సూచనలతోపాటు వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాయి. దేవాలయాల్లో కూడా వ్యక్తిగత శుభ్రతపై భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ దేవాలయమైన శ్రీశైల క్షేత్రంలో దర్శన సమయంలో క్యూలైన్లో వచ్చే భక్తులకు శానిటైజర్‌ను అందజేస్తున్నారు. భక్తులు చేతులను శుభ్రం చేసుకున్న తర్వాతే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. కరోనా నేపథ్యంలో అధికారుల ముందస్తు చర్యలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో మొదటి కొవిడ్‌-19 కేసు నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలకు అవసరమైన సమాచారం అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌ లైన్ నంబర్లు అందుబాటులో ఉంచారు. కరోనా వైరస్‌ కారణంగా దేశంలో ఇప్పటికే ఓ వ్యక్తి మరణించగా..75పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని