స్థానిక ఎన్నికలపై కాసేపట్లో ఎస్‌ఈసీ ప్రకటన

స్థానిక ఎన్నికలను వాయిదా నేపథ్యంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ భేటీ ముగిసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి, జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన

Published : 16 Mar 2020 12:34 IST

అమరావతి: స్థానిక ఎన్నికల వాయిదా నేపథ్యంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ భేటీ ముగిసింది. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో కరోనా వైరస్‌ వ్యాప్తి, జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్రమంలో ఎన్నికలను వాయిదా వేసినట్లు గవర్నర్‌కు ఎస్‌ఈసీ వివరణ ఇచ్చినట్లు సమాచారం. అయితే స్థానిక ఎన్నికల వాయిదాపై సీఎం జగన్‌ ఆదివారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం  చేశారు. కరోనా సాకుతో ఉద్దేశపూర్వకంగానే ఎన్నికలను వాయిదా వేసినట్లు ఆరోపించారు. ఎస్‌ఈసీ తీరుపై గవర్నర్‌ను సైతం కలిసి ఫిర్యాదు  చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ గవర్నర్‌తో భేటీ అయి వాయిదా వేయడానికి గల కారణాలను వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు  ఎస్‌ఈసీ వివరణపై గవర్నర్‌  ఏవిధంగా స్పందించారనే విషయం తెలియరాలేదు. గవర్నర్‌తో భేటీ నేపథ్యంలో ఎస్‌ఈసీ కాసేపట్లో ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎన్నికల అధికారులతో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ చర్చిస్తున్నారు. గవర్నర్‌తో భేటీలో చర్చకు వచ్చిన అంశాలను ఆయన వివరిస్తున్నారు. సమావేశం అనంతరం ఎస్‌ఈసీ ప్రకటన చేసే అవకాశముంది. ఈ ప్రకటనలో స్థానిక ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు