పంజాబ్‌లో ప్రజారవాణా బంద్‌

కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు పంజాబ్‌ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈక్రమంలో ప్రజారవాణాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Published : 19 Mar 2020 17:45 IST

చండీగఢ్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు పంజాబ్‌ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రజారవాణాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 20 అర్ధరాత్రి నుంచి ఈ నిలిపివేత అమలులోకి వస్తుందని పేర్కొంది. కరోనా నేపథ్యంలో ప్రజారవాణాను నిలిపివేయనున్న తొలి రాష్ట్రం పంజాబ్‌ కావడం విశేషం. శుక్రవారం నుంచి బస్సులు, ఆటోలతో పాటు ఏ ఇతర ప్యాసింజర్‌ వాహనాలు రోడ్లపై తిరిగేందుకు వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం మంత్రివర్గం సమావేశమైంది. ఈక్రమంలో ప్రజారవాణాను నిలిపివేసేందుకు కేబినేట్‌ ఆమోదం తెలిపింది. దీంతో పాటు ప్రభుత్వం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. శుభకార్యాలైతే 50 మంది, ఇతర సమావేశాలైతే 20 మంది కంటే ఎక్కువ గుంపులుగా ఉండరాదని చెప్పింది. ఇదిలా ఉండగా.. భారత రైల్వే సైతం విడతల వారీగా రైళ్ల రద్దుకు పూనుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని