పిల్లల ‘టిక్‌టాక్‌’ అకౌంట్లపై ఓ కన్నేయొచ్చు

సామాజిక మాధ్యమం ‘టిక్‌టాక్‌’లో తమ పిల్లల కార్యకలాపాలపై తల్లిదండ్రులు ఇకనుంచి ఓ కన్నేసి ఉంచొచ్చు. ఈ క్రమంలో యాప్‌లో ‘ఫ్యామిలీ పెయిరింగ్‌’ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సదరు సంస్థ గురువారం ప్రకటించింది.

Published : 17 Apr 2020 01:24 IST

‘ఫ్యామిలీ పెయిరింగ్‌’ విధానం తీసుకురానున్న సంస్థ

న్యూదిల్లీ: ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ ‘టిక్‌టాక్‌’లో తమ పిల్లల కార్యకలాపాలపై తల్లిదండ్రులు ఇకనుంచి ఓ కన్నేసి ఉంచొచ్చు. దీనికోసం యాప్‌లో ‘ఫ్యామిలీ పెయిరింగ్‌’ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సదరు సంస్థ గురువారం ప్రకటించింది. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. తద్వారా పెద్దలు తమ టిక్‌టాక్‌ అకౌంట్‌ను పిల్లల అకౌంట్‌తో లింక్‌ చేసుకోవచ్చు. అయితే పిల్లలు మాత్రం ఎప్పుడైనా ఈ విధానం నుంచి బయటకు రావచ్చు.. కానీ ఈ విషయం వారి అకౌంట్‌కు లింక్‌ అయిఉన్న తల్లిదండ్రులకు తెలుస్తుంది. దీంతో వారు మళ్లీ కనెక్ట్‌ అయ్యే వీలుంది.

వెల్‌ బీయింగ్‌ విభాగంలో మార్పులకు అవకాశం..
ఫ్యామిలీ పెయిరింగ్‌ విధానంలో పిల్లల అకౌంట్‌లో స్క్రీన్‌ టైం మేనేజ్‌మెంట్‌, డైరెక్ట్‌ మెసేజెస్‌, రిస్ట్రిక్టెడ్‌ మోడ్‌ ఆప్షన్లను నియంత్రించవచ్చు. స్క్రీన్‌టైం మేనేజ్‌మెంట్‌ ద్వారా చిన్నారులు యాప్‌ను ఎంతసేపు వినియోగించాలో నిర్ణయించవచ్చు. సందేశాల నియంత్రణకు వారి అకౌంట్లో రిస్ట్రిక్టెడ్‌ మోడ్‌ ఆన్‌ చేయొచ్చు. సంబంధిత అకౌంట్‌కు లింక్‌ కాకున్నా.. వారి యాప్‌లో డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ విభాగంలో ఈ మార్పులు చేపట్టవచ్చు.
ఎవరు మెసేజ్‌ చేయొచ్చో ఎంచుకోవచ్చు..
తాజా అప్‌డేట్‌లో 16 ఏళ్ల లోపు యూజర్ల రిజిస్టర్డ్‌ అకౌంట్లలో డైరెక్ట్‌ మెసేజెస్‌ ఆప్షన్‌ కనుమరుగు కానుంది. ఆపైన వయస్సు గలవారికి.. తమ అప్రూవ్డ్‌ ఫాలోవర్స్‌లో ఎవరు మెసేజ్‌ చేయొచ్చో ఎంచుకునే అవకాశం కల్పించనుంది. లేదా ఎదుటివారికి మెసేజ్‌ అనే ఆప్షనే కనిపించకుండా కూడా చేయొచ్చని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని