కుమారుడి కోసం.. 5 రాష్ట్రాలు, 2700కి.మీ దాటి..

కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో ఎక్కడికి వెళ్లాలన్నా ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. ఈ నేపథ్యంలోనే ...

Published : 18 Apr 2020 00:46 IST


 

కొట్టాయం(తిరువనంతపురం) : దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేరళకు చెందిన ఓ 50 ఏళ్ల మహిళ తన కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడని తెలిసి.. అతడిని చూసేందుకు ఏకంగా  ఐదు రాష్ట్రాలను దాటుకుంటూ 2700 కిలోమీటర్లు ప్రయాణించింది.

వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన  అరుణ్‌కుమార్‌(29) రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల అరుణ్‌కుమార్‌ అనారోగ్యంతో జోధ్‌పూర్‌ ఎయిమ్స్‌లో చేరారు. అతడి ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్‌ వైద్యులు కేరళలో ఉంటున్న కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో అరుణ్‌కుమార్‌ తల్లి శీలమ్మవాసన్‌.. అరుణ్‌ భార్య, సమీపబంధువైన మరో వ్యక్తితో కలిసి కారులో రాజస్థాన్‌కు బయలుదేరింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల మీదుగా మూడురోజులపాటు 2700 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరికి కుమారుడిని చేరుకుంది.
 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘దేవుడి దయ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా నా కుమారుడిని చేరుకోగలిగాను. క్యాబ్‌లు సమకూర్చిన హిందూ హెల్ప్‌లైన్‌, వీహెచ్‌పీ సంస్థ వాలంటీర్లకు కృతజ్ఞతలు.’ అని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల మీదుగా ప్రయాణించేందుకు పాసులు ఇప్పించినందుకు కేంద్ర మంత్రి వి.మురళీధరన్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌ , కాంగ్రెస్‌ నేత ఉమెన్‌చాందీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని