మూడో వ్యాక్సిన్‌కు చైనా అనుమతి

కరోనా వైరస్‌ మూడో వ్యాక్సిన్‌ రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చైనా అనుమతినిచ్చింది. సినోఫార్మ్‌ నేతృత్వంలోని వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయలాజికల్‌ ప్రొడక్ట్స్‌, వుహాన్‌ వైరాలజీ ల్యాబ్‌, చైనా సైన్యానికి చెందిన వైద్య సంస్థలు వేర్వేరుగా రూపొందించిన వ్యాక్లిన్లతో క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టాయని అక్కడి అధికార....

Updated : 25 Apr 2020 18:32 IST

త్వరలోనే రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌

బీజింగ్‌: కరోనా వైరస్‌ మూడో వ్యాక్సిన్‌ రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చైనా అనుమతినిచ్చింది. సినోఫార్మ్‌ నేతృత్వంలోని వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయలాజికల్‌ ప్రొడక్ట్స్‌, వుహాన్‌ వైరాలజీ ల్యాబ్‌, చైనా సైన్యానికి చెందిన వైద్య సంస్థలు వేర్వేరుగా రూపొందించిన వ్యాక్లిన్లతో క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టాయని అక్కడి అధికార మీడియా సంస్థ షిన్హువా తెలిపింది.

సినోఫార్మ్‌ ‘చైతన్య రహిత’ వ్యాక్సిన్‌ను రూపొందించింది. ఇందులో వైరస్‌ కణాలు, బ్యాక్టీరియా, ప్రయోగశాలలో పెంచిన ప్యాథోజెన్స్‌ ఉంటాయి. ఇవి వ్యాధి కారక శక్తిని కోల్పోయి ఉంటాయి. కాగా ప్రత్యక్ష వ్యాక్సిన్‌లో బతికున్న ప్యాథోజెన్స్‌ ఉంటాయి. కరోనా వైరస్‌ ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పాలంటూ అమెరికా సహా అనేక దేశాలు వుహాన్‌ వైరాలజీ ప్రయోగశాలపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఐతే వదంతుల ఆధారంగా వారు విమర్శిస్తున్నారని ప్రయోగశాల బదులిచ్చింది.

ప్రస్తుత వ్యాక్సిన్‌తో మూడు వయసుల వారీగా 96 మందితో తొలిదశ క్లినికల్‌ ట్రయల్స్‌ను ఏప్రిల్‌ 23న ఆరంభించారు. ఆ ప్రయోగాల్లో వ్యాక్సిన్‌ మంచి ఫలితాలను ఇచ్చిందని సినోఫార్మ్‌ తెలిపింది. వ్యాక్సిన్‌ గ్రహీతలు ఆరోగ్యంగా ఉన్నారని వారిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వెల్లడించింది. చైతన్య రహిత వ్యాక్సిన్‌తో హనన్‌ ప్రావిన్స్‌లోని జియావోజౌ నగరంలో ర్యాండమ్‌, డబుల్‌ బ్లైండ్‌, ప్లాసిబో నియంత్రిత క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నామని పేర్కొంది. మూడో దశ పూర్తై వ్యాక్సిన్‌ పనితనం, సామర్థ్యం తెలిసేందుకు కనీసం ఏడాది పడుతుందని తెలిపింది.

శుక్రవారం రోజు 12 కొవిడ్‌-19 కేసులు కొత్తగా నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ శనివారం తెలిపింది. అందులో 11 ఇతర దేశాల నుంచి వచ్చినవారేనని వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ 82,816 కేసులు నమోదవ్వగా 4,632 మంది మృతిచెందారు. శుక్రవారం 29 లక్షణాల్లేని కేసులు నమోదవ్వడంతో ఈ సంఖ్య 983కు చేరింది. వీరందరినీ వైద్య పరిశీలనలో ఉంచారు.

చదవండి: ఈ టీచర్‌ బౌలింగ్‌కు నెటిజన్లు ఫిదా

చదవండి: భారతీయులను రక్షిస్తున్న శక్తి అదే


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని