ఆంక్షల సడలింపుతో హైదరాబాద్‌లో రద్దీ

భాగ్యనగరంలో దాదాపు 45 రోజుల తర్వాత వాహనాలు భారీగా రోడ్డెక్కాయి. లాక్‌డౌన్‌ నిబంధనల్లో ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఆయా రంగాలకు చెందిన వారు బయటకి వస్తున్నారు. రవాణా,

Updated : 08 May 2020 19:29 IST

హైదరాబాద్‌: భాగ్యనగరంలో దాదాపు 45 రోజుల తర్వాత వాహనాలు భారీగా రోడ్డెక్కాయి. లాక్‌డౌన్‌ నిబంధనల్లో ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఆయా రంగాలకు చెందిన వారు బయటకి వస్తున్నారు. రవాణా, రిజిస్ట్రేషన్‌ శాఖలతోపాటు నిర్మాణ రంగానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. ఐటీ ఉద్యోగులు సైతం 33 శాతం మంది కార్యాలయాలకు వెళ్తున్నారు. నిర్మాణ రంగానికి సంబంధించిన దుకాణాలు సైతం తెరచుకుంటున్నాయి. 

ఎలక్ట్రికల్, ప్లంబర్‌, సిమెంట్‌, స్టీల్‌ దుకాణాలు తెరవడంతో వాటిలో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే 35 శాతం వాహనాలు రహదారులపై తిరుగుతున్నాయి. దీనికి తోడు మద్యం దుకాణాలు సైతం తెరుచుకోవడంతో నగర రోడ్లపై రద్దీ కనిపిస్తోంది. మార్చి 22న లాక్‌డౌన్‌ ప్రకటించిన తొలిరోజుల్లో రోడ్లపై వాహనాలు చాలా తక్కువ సంఖ్యలో కనిపించాయి. అయితే లాక్‌డౌన్‌ సడలింపులతో గత రెండు రోజుల నుంచి నగరంలో వాహనాల రాకపోకల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పోలీసులు మాత్రం వెసులుబాటు కల్పించిన రంగాలకు చెందిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. మిగతా  వాహనదారులపై చర్యలు తీసుకుంటున్నారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని