దిల్లీలో మరోసారి కంపించిన భూమి

దేశ రాజధాని దిల్లీలో ఆదివారం మరోసారి భూమి కంపించిది. నెల రోజుల వ్యవధిలో దిల్లీలో భూమి కంపించడం ఇది మూడోసారి. భూకంపం కేంద్రం ఈశాన్య దిల్లీలోని వాజిర్‌పూర్‌లో ప్రాంతంలో....

Updated : 10 May 2020 18:39 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఆదివారం మరోసారి భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 3.4గా నమోదయినట్లు జాతీయ భూకంప అధ్యయన విభాగం (ఎన్‌సీఎస్‌) తెలిపింది. నెల రోజుల వ్యవధిలో దిల్లీలో భూమి కంపించడం ఇది మూడోసారి. భూకంపం కేంద్రం ఈశాన్య దిల్లీలోని వాజిర్‌పూర్‌లో ప్రాంతంలో ఉన్నట్లు ఎన్‌సీఎస్‌ అధిపతి జే.ఎల్. గౌతమ్‌ తెలిపారు. దాదాపు ఐదు కిలోమీర్లు లోతు వరకు భూమి కంపించిందని వెల్లడించారు. గత నెల 12, 13 తేదిల్లో కూడా వాజిర్‌పూర్ పరిసర ప్రాంతాలు కేంద్రంగా 3.5, 2.7 తీవ్రతతో రెండు సార్లు భూమి కంపించిందని ఎన్‌సీఎస్‌ తెలిపింది. భూకంపం రావడానికి అవకాశం ఉన్న ఐదు జోన్లలో దిల్లీ నాలుగో జోన్‌లో ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని